ఇలాంటి పరిస్థితులు హృతిక్కే కాదు.. ఉద్యోగంలో ఉన్నత హోదా కలిగిన చాలా మంది ఎదురవుతుంటాయి. దీనికి కారణం?
బాస్ అంటేనే బేజారు..
ఆఫీసుల్లో కొందరికి బాస్ అన్నా టీమ్ లీడర్ అన్నా పడదు. ఆయనంటేనే బేజారు. ఆయన్ను చూస్తేనే చిరాకు. ఆయన ముందు వినయం, విధేయత కనబరుస్తారు కానీ... మనసులో మాత్రం వ్యతిరేకభావం ఉంటుంది. ఇలాంటి మనస్తత్వమున్న వారు ఒకరిద్దరికే పరిమితం కారు.. వీరి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. వీళ్లంతా ఒక జట్టు కడతారు. టైమ్ దొరికితే చాలు.. బాస్ గురించి చాడీలు చెప్పుకోవడమే వీరి పని. ఇదంతా ఆయన గమనించడు. తన పట్ల ఎంప్లాయీస్లో ఎంత వ్యతిరేకత ఉందో పసిగట్టడు.
తప్పెవరిది..?
ఎంప్లాయీస్ అలా మాట్లాడుకుంటున్నారంటే.. తప్పు వాళ్లదేనా? కానేకాదు. వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిదే. అంటే బాస్‌ది. ఎందుకంటే ఆయన ఎంప్లాయీస్‌కు దగ్గర కాకపోవడం వల్లే అలాంటి వాతావరణం క్రియేట్ అయ్యింది. ఎవరెంత పని చేస్తున్నారో సరిగా అంచనా వేయకపోవడం, పని చేయకుండా మాటలతో గారడీ చేసే వారికి ప్రాధాన్యమివ్వడం, ఎక్కువ పనిచేసే వారిని చిన్నచూపు చూడ్డం, క్రియేటివిటీని పరిగణనలోకి తీసుకోకపోవడం లాంటి ధోరణి వల్లే కొందరు బాస్‌కు వ్యతిరేకులుగా మారుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి?
సూచనలు పాటించాలి
చాలామంది ప్రొఫెషనల్స్ తమ ఆలోచనలను బాస్‌తో పంచుకోవాలనుకుంటారు. కంపెనీ అభివృద్ధికి దోహదపడుతుందనే ఉద్దేశంతో కొన్ని సూచనలు చేస్తుంటారు. అలాంటప్పుడు సానుకూలంగా స్పందించాలి. ఒక ఎంప్లాయి ఏదైనా సూచనలు చేస్తున్నాడంటే.. అందులో అతని స్వప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు. అలాగని అతడు చెప్పేవన్నీ అలాంటివే అని అనుకోవద్దు. ఆ సూచనలు కంపెనీకి ఏ మేరకు ఉపయోగపడతాయో అనేది ఆలోచించాలి. అతడు చెప్పే విషయాన్నంతా ఓపిగ్గా వినాలి. ఆ సూచన ఆమోదయోగ్యమైతే ఓకే అనాలి. లేదంటే సున్నితంగానే తిరస్కరించాలి. అంతే తప్ప.. తనకు నచ్చని సూచనల ఇచ్చినందుకు కస్సుబుస్సులాడొద్దు. ఈ దోరణి బాస్‌కు, సిబ్బందికి మధ్య దూరాన్ని పెంచుతుంది. సిబ్బంది సూచనలు స్వీకరిస్తే మరింత గౌరవం పెరుగుతుందనే విషయాన్ని మరచిపోవద్దు.
క్రెడిట్ ఇవ్వండి
బాగా పనిచేసే ఎంప్లాయీస్‌ను మనసారా అభినందించాలి. అప్పుడే మంచి బాస్ అనిపించుకుంటారు. ఒక పనిని ఎవరైనా క్రియేటివ్‌గా చేస్తే దాని క్రెడిట్ అంతా వారికే ఇవ్వాలి. మీ ఖాతాలో వేసుకోవద్దు. ఇది ఏమాత్రం మంచిది కాదు. క్రియేటివిటీ కనబర్చే వారికి క్రెడిట్ ఇచ్చినప్పుడే ఎంప్లాయీస్ మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. తద్వారా కంపెనీ ప్రొడక్టవిటీ పెరుగుతుంది. ఇంత మంచి టీమ్‌ను మెయిన్‌టెయిన్ చేసినందుకు యాజమాన్యం మీ సేవలకు గుర్తింపునిస్తుంది.


Post a Comment
0Comments