ఆందోళన వద్దు
రంగం ఏదైనా విజయం సాధించడానికి సరైన మార్గం అవసరం. మనమెంత ఎత్తుకు ఎదుగుతామనేది మన జీవితం పట్ల మనకున్న దృక్పథాన్నిబట్టి ఉంటుంది. మనసులో రూపొందించుకున్న ఆశలు, ఆశయాలే జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి. ఆలోచనలు సక్రమమైనపుడే మేధస్సు వికసిస్తుంది. ఒక మంచి ఆలోచన మనకు తట్టినపుడు దానిని పదే పదే మననం చేసుకోవాలి. చెడు ఆలోచనలను అదుపు చేయటం ముఖ్యం. అయితే... ఇది అంత సులభమేమీ కాదు. అయినా ప్రయత్నిస్తూనే ఉండాలి. బిజీ లైఫ్తోనే ఇది సాధ్యం. నిరంతరం పనిచేస్తూంటే మనసుకు, అందులో చెలరేగే ఆలోచనలకు స్థిరత్వం ఉంటుంది. అప్పుడే మె రుగైన జీవితానికి ఉపయోగపడే కొత్త కొత్త ఐడియాలు పుట్టుకొస్తాయి. వాటిని అప్పటికప్పుడే మరచిపోవద్దు. దాన్ని ఆచరణలో పెట్టే దాకా నిరంతరం నెమరేసు కుంటూనే ఉండాలి. అంతేకాదు.. ఐడియాలపై ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి. వాటిని కార్యరూపం దాల్చడానికి ఎదురయ్యే సాధ్యాసాధ్యాలను సమీక్షించు కోవాలి. ఎంతటి కఠినమైన పనినైనా చేయడానికి సిద్ధపడాలి.స్థయిర్యాన్ని కూడగట్టుకున్నప్పుడే అసాధ్యం సుసాధ్యమవుతుంది.
మన పనికి ఎవరో ఆటంకం కలిగిస్తారని ముందుగానే ఊహించు కోవడం కన్నా పరికితనం మరొకటి లేదు. ఇలా చేస్తే ఎవరో ఎందుకు..? మనకు మనమే అడ్డంకులు సృష్టించుకున్నట్టు. ఆగధాలను, ప్రమాదాలను అధిగమిస్తేనే విజయం.


Post a Comment
0Comments