ఆమె ఇష్టాన్ని కాదన్నారో.. ఇక అంతే!
మీరెవరినైనా
ప్రేమిస్తున్నారా..? మీరు ఇష్టపడే అమ్మాయిని అదే పనిగా పొగుడు తున్నారా?
అయితే.. అలాగే కంటిన్యూ చేయండి. మీరెంత పొగిడితే అంత మంచిది. 'అందరికన్నా
నువ్వే గొప్ప' అంటూ ఉండండి. అప్పుడే మీరంటే ఆమెకు ఎనలేని ప్రేమ
పెరుగుతుంది. పొరబాటున కూడా ఆమె ముందు మరో అమ్మాయిని పొగిడారా.. ఇక అంతే!
ఎవరితోనైనా ఆమెను పోల్చినా మీకు మూడినట్టే. నీకన్నా ఫలానా హీరోయిన్ చాలా
బాగుంటుందని అన్నా మీ పని ఖతమే. సహజంగా అమ్మాయిల మనస్తత్వం అలాగే ఉంటుంది.
ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ఇది రుజువైంది. ప్రేమించిన అమ్మాయితో
ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆమె ఇష్టానికే విలువ ఇవ్వాలని అంటున్నారు
పరిశోధకులు. అమ్మాయికి నచ్చిన దాన్ని బాగోలేదని అనాల్సినప్పుడు కాస్త
సున్నితంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. 'నీకు నచ్చిన వస్తువు బాగుంది.
కానీ.. దానికన్నా ఇది బాగుంటుందేమో చూడు..' అంటూ మీ ఇష్టాన్ని
జోడించాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అంతేకాని..
'నీకు ఈ వస్తువు ఎలా నచ్చింది?' అని అనొద్దని, ఇది అనర్థానికి దారి
తీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 'ప్రతి మనిషికీ కొన్ని బలహీనతలు
ఉంటాయి. వాటిని ఎవరైనా ఎత్తి చూపిస్తుంటే వారు తట్టుకోలేరు. అలాంటప్పుడు
మిమ్మల్ని ప్రేమించే వారి బలహీనతల్ని ఎత్తి చూపడానికి ఎట్టి
పరిస్థితుల్లోనూ ప్రయత్నించొద్దు' సలహా ఇస్తున్నారు పరిశోధకులు.


Post a Comment
0Comments