మరచిపోవడం అసాధ్యం
ఎంత
ప్రేమించిన వాళ్లైనా అప్పుడప్పుడు వాదులాడుకోవడం సహజం. ఇది అప్పటికప్పుడు
సమసిపోతే నోప్రాబ్లం. ముదిరితే మాత్రం రెండు మనసుల మధ్య అంతరాలు
పెరుగుతాయి. చివరకు ఇది బ్రేకప్‌కి కూడా దారి తీయొచ్చు. ఇద్దరి మధ్య
వాగ్వాదం జరిగినప్పుడు చాలామందికి నోరు అదుపులో ఉండదు. అనరాని మాటలు
అనేస్తారు. ఇదే గొడవ ప్రేమికుల మధ్య జరిగినా అంతే. టంగ్ కంట్రోల్
తప్పుతుంది. ఒకరి కారణంగా మరొకరి మనోభవాలు దెబ్బతింటాయి.
కొన్ని రోజుల తర్వాత ఈ గొడవ గురించి ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు లేదా ఇద్దరు దాన్ని గుర్తు చేసుకున్నప్పుడు అబ్బాయికన్నా అమ్మాయే ఎక్కువ ఆవేదన వెళ్లగక్కుతుంది. తనను అబ్బాయి ఎలా బాధ కలిగించాడో ఏ అంశమూ మిస్ కాకుండా పూస గొచ్చినట్టు చెబుతుంది. ఎన్ని రోజులైనా ఆ విషయాలు మరచిపోదు. అదే అబ్బాయిలకైతే జరిగిన విషయమంతా గుర్తుండదు. 'ఆ మాట నేనన్నానా? ఏమో.. నాకు గుర్తు లేదు' అంటారు. ఎందుకలా? మహిళల జ్ఞాపకశక్తి పురుషులకన్నా మెరుగ్గా ఉంటుందని దానికర్థం.
మహిళలు తమకు కలిగిన చేదు అనుభవాలను అంత సులభంగా మరచిపోలేరు. వారు ఎదుర్కొనే మానసిక వ్యథను పదేపదే నెమరేసుకుంటారు. స్త్రీపురుషుల శారీరక నిర్మాణంలో ఉన్నట్టే మెదడులోనూ తేడా ఉండటమే దీనికి కారణమంటున్నారు పరిశోధకులు. మెదడులో జ్ఞాపకశక్తికి సంబంధించిన కొన్ని కేంద్రాలు మహిళల మెదడులో చాలా మెరుగ్గా పనిచేస్తాయి. ఆ భాగాలకు రక్తం ద్వారా సరఫరా అయ్యే స్త్రీ మార్మోన్ ప్రభావమే వారి మెరుగైన జ్ఞాపకశక్తికి మూలం అంటున్నారు.

Post a Comment
0Comments